నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి
జల్ పల్లి, మేజర్ న్యూస్ :వాది ఏ ముస్తఫా బస్తిలో నేరాలకు, భూకబ్జాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పహాడిషరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి నారాయణ రెడ్డి అన్నారు. వాది ఏ ముస్తఫా బస్తిలో పహాడిషరీఫ్ పోలీస్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఎవరైనా ఇబ్బందులు దౌర్జన్యాలు చేస్తున్న వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలన్నారు.
చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కాకుంటే గొడవలు జరుగకుండా వెంటనే పోలీస్ లకు ఫిర్యాదు చేయాలన్నారు ,ఫిర్యాదు లు చేయకుండా గొడవ పడి శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు, గంజాయి విక్రయించిన కొనుగోలు చేసిన నేరమని గంజాయి విక్రయలు జరిగితే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలన్నారు,ఆర్థికంగా బాగున్నా వారు సీసీ కెమెరాల ఏర్పాటు కు పోలీస్ లకు సహకరించాలన్నారు.వాది ఏ ముస్తఫా బస్తిలో త్వరలో వంద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేర రహిత బస్తిగా మారుస్తామన్నారు. ఐ కార్యక్రమం లో ఎస్ ఐ ఫైసల్ అహ్మద్, స్థానికులు షైక్ హుస్సేన్, సయ్యద్ జాన్, స్థానికులు పాల్గొన్నారు.
అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.