అంజి గెలవడంతో మొక్కు తీర్చుకున్న యువకులు
దేవనకొండ గ్రామ సర్పంచ్ గా ఎర్రగోటి అంజి గెలవడంతో అంజి అభిమానులు ఆదివారం 200 తిరుమల మెట్లను మొకాళ్ళ తో ఎక్కి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా జనార్దన్,సాయి,అభిరామ్,విజయ్,ప్రకాష్,మహేంద్ర, తరుణ్ అనే యువకులు మాట్లాడుతూ దేవనకొండ గ్రామ పంచాయతీ అభ్యర్థి ఎర్రకోటి అంజి గెలిస్తే మెట్ల పై మోకాళ్ళతో ఎక్కుతామని దేవున్ని మొక్కుకోవడం జరిగింది.కావున గెలిచిన అనంతరం తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనముకు 3550 మెట్లు కాళీ నడకతో వెళ్లి 200 మెట్లు మోకాళ్ళతో ఎక్కి స్వామి వారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని తెలిపారు.