BREAKING
అలియాస్ రుక్మిణీలో నితిన్‌ని చూసి నేనే ఆశ్చర్యపోయా.. డిసెంబర్ 4న సాలిడ్ కమ్‌బ్యాక్ ఖాయమంటున్న నాని బురదవెంకటాపురం సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం రంపచోడవరం పంచాయతీ సర్పంచ్ ప్రమాణస్వీకారం ముందే గ్రామపంచాయతీ ఖజానా ఖాళీ? లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం అన్నవరం రత్నగిరిపై వైభవంగా శ్రీ సత్యదేవుని రథ సేవ ఆకాశంలో ఒక తారతో రుహాని శర్మకు కొత్త ఊపు.. బిజిలీ పాత్రకు ప్రశంసల వర్షం మాజీ ఎంపీ రాయపాటి రాజకీయ కురువృద్ధులు ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఫిర్యాదు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. మా గిరిజనులకు న్యాయం చేయండి ఉద్యమాల గడ్డ దుబ్బాక రామకృష్ణ మిషన్ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోండి మున్సిపల్ చైర్మన్ ను కలిసిన హుస్సేన్ పురం గ్రామ సర్పంచ్ మహిళలు రోబోలు కాదు.. భర్తలు మద్దతుగా నిలవాలంటూ రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

టిడిపి నేత నిరంతర కష్టానికి సర్పంచ్ గా ఫలితం

Select Suryaa Now
టిడిపి నేత నిరంతర కష్టానికి సర్పంచ్ గా ఫలితం

అడ్డతీగల, సూర్య ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 26 సంవత్సరాల కష్టానికి పార్టీ తగిన సమయంలో సర్పంచ్ గా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా సమీప ప్రత్యర్థి పై 106 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించిన ఏజెన్సీ అడ్డతీగల మండల క్లస్టర్ ఇంచార్జ్ గుంజిగడ్డ గంగరాజు విజయ గాధ. ఏజెన్సీ అడ్డతీగల మండలంలోని మారుమూల సరిహద్దు గిరిజన గ్రామమైన ఉలిగోగుల సోమన్నపాలెం పంచాయతీ పరిధిలోకి వస్తుంది. అదే గ్రామానికి చెందిన గుంజిగడ్డ గంగరాజు 26 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మరియు గడిచిన మూడు సంవత్సరాలుగా మండల క్లస్టర్ ఇన్చార్జిగా నిరంతర సేవలు అందిస్తున్నారు. 15 సంవత్సరాలుగా రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైన కష్టకాలంలోనూ కార్యకర్తగా కొనసాగుతూ మండలం తో పాటు నియోజకవర్గంలో ఏ మీటింగ్ జరిగిన అందులో పార్టీ తీసుకొనే నిర్ణయాలకు కట్టుబడి పార్టీ అభివృద్ధికి ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన గంగరాజు కి తొలి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సామన్నపాలెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రిజర్వేషన్ ప్రకారం మహిళలకు కేటాయించడం అది కూడా గంగరాజు భార్య లక్ష్మి నీ ఎంపిక చేయడం జరిగింది. పార్టీ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అక్కడి పంచాయతీ ప్రజల ఆశీస్సులతో తన పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను చాటుకుంటూ ప్రత్యర్థి బలపరిచిన అభ్యర్థిపై తన భార్య గుంజి గడ్డ లక్ష్మి ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర వహించాడు. ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్చార్జి గంగరాజు మాట్లాడుతూ పార్టీలో కార్యకర్తగా సేవ ప్రారంభించిన తనకి అధిష్టానం అంచలంచలుగా గుర్తింపు ఇచ్చిందని ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ కావడం అందులోనూ తన భార్యకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు తెలుగుదేశం పార్టీ కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపునివ్వడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని పేర్కొన్నారు అలాగే తన కుటుంబానికి అవకాశం కల్పించిన నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మరియు రాజవొమ్మంగి జడ్పిటిసి మఠం విజయభాస్కర్లకు ధన్యవాదాలు తెలిపారు పంచాయతీలో తెలుగుదేశం మార్క్ అభివృద్ధిని చేసి చూపిస్తామని పంచాయతీలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని సర్పంచ్ గుంజి గడ్డ లక్ష్మి పేర్కొన్నారు