BREAKING
అలియాస్ రుక్మిణీలో నితిన్‌ని చూసి నేనే ఆశ్చర్యపోయా.. డిసెంబర్ 4న సాలిడ్ కమ్‌బ్యాక్ ఖాయమంటున్న నాని బురదవెంకటాపురం సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం రంపచోడవరం పంచాయతీ సర్పంచ్ ప్రమాణస్వీకారం ముందే గ్రామపంచాయతీ ఖజానా ఖాళీ? లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం అన్నవరం రత్నగిరిపై వైభవంగా శ్రీ సత్యదేవుని రథ సేవ ఆకాశంలో ఒక తారతో రుహాని శర్మకు కొత్త ఊపు.. బిజిలీ పాత్రకు ప్రశంసల వర్షం మాజీ ఎంపీ రాయపాటి రాజకీయ కురువృద్ధులు ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఫిర్యాదు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. మా గిరిజనులకు న్యాయం చేయండి ఉద్యమాల గడ్డ దుబ్బాక రామకృష్ణ మిషన్ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోండి మున్సిపల్ చైర్మన్ ను కలిసిన హుస్సేన్ పురం గ్రామ సర్పంచ్ మహిళలు రోబోలు కాదు.. భర్తలు మద్దతుగా నిలవాలంటూ రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు

అన్నవరం సెంట్రల్ స్టోర్స్‌పై ఈవో లక్ష్మీ శివజ్యోతి పర్యవేక్షణ

Select Suryaa Now
అన్నవరం సెంట్రల్ స్టోర్స్‌పై ఈవో లక్ష్మీ శివజ్యోతి పర్యవేక్షణ
  • అధికారిని వివరణ కోరిన వైనం

అన్నవరం, మేజర్ న్యూస్ :
కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన  శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో పరిపాలనా వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించిన కార్యనిర్వహణాధికారి శ్రీమతి లక్ష్మీ శివజ్యోతి సెంట్రల్ స్టోర్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టోర్స్‌లోని వస్తు సామగ్రి నిల్వలు, రికార్డుల నిర్వహణ, సరుకుల వినియోగం, పంపిణీకి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
స్టోర్స్ నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణాధికారి పసుపులేటి రమేష్‌ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని అంశాలపై ఆయనను వివరణ కోరారు. స్టోర్స్‌లో నిల్వ ఉన్న వస్తు సామగ్రికి సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, ప్రతి వస్తువు వినియోగం, పంపిణీ విషయంలో పారదర్శకత పాటించాలని ఈవో సూచించారు.
దేవస్థానానికి సంబంధించిన ప్రతి విభాగంలో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, పరిపాలనా వ్యవహారాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు. దేవస్థాన ఆస్తులు, వస్తు సామగ్రి పరిరక్షణతో పాటు నిర్వహణలో జవాబుదారీతనం ఉండాలని ఈవో లక్ష్మీ శివజ్యోతి పేర్కొన్నారు.