లోవ తలుపులమ్మ ఆలయానికి భక్తుల తాకిడి
- ఆదివారం అమ్మవారిని దర్శించుకున్న 4 వేల మంది భక్తులు..
- రూ.1,86,991 ఆదాయం
తుని, మేజర్ న్యూస్ : కాకినాడ జిల్లా తుని మండలం లోవ శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నవంబర్ 29వ తేదీ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచి ఉండగా, సుమారు 4 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆదివారం ఒక్కరోజే దేవస్థానానికి వివిధ విభాగాల ద్వారా మొత్తం రూ.1,86,991 ఆదాయం సమకూరింది. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.86,970, పూజా టిక్కెట్ల ద్వారా రూ.79,270, కేశఖండన ద్వారా రూ.5,800, హనుమ పూజలు, కాటేజీల ద్వారా రూ.2,100, ఇతర సేవా టిక్కెట్ల ద్వారా రూ.9,412, ఇతర మిసిలేనియస్ విరాళాల ద్వారా రూ.3,439 ఆదాయం లభించింది.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు అవసరమైన అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచారు. దర్శనం, ప్రసాదాల పంపిణీ, పూజా కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను దేవస్థానo కార్యనిర్వహణాధికారి పి. విశ్వనాథ రాజు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు పి. భాస్కర సత్యనారాయణ పర్యవేక్షించారు. ఈ వివరాలను కార్యనిర్వహణాధికారి పి. విశ్వనాథ రాజు వెల్లడించారు.