BREAKING
నాని నన్ను దేవుడిలా ఆదుకున్నాడు.. అలియాస్ రుక్మిణీ వేదికపై నితిన్ భావోద్వేగం అన్నవరం సెంట్రల్ స్టోర్స్‌పై ఈవో లక్ష్మీ శివజ్యోతి పర్యవేక్షణ టిడిపి నేత నిరంతర కష్టానికి సర్పంచ్ గా ఫలితం ఓటీటీలోకి రామాయణం ఇప్పట్లో లేదు.. భారీ వసూళ్ల వేళ నిర్మాత నమిత్ మల్హోత్రా కీలక ప్రకటన భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్నవరంలో ప్రత్యేక చర్యలు లోవ తలుపులమ్మ ఆలయానికి భక్తుల తాకిడి ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ సీన్.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు చేసిన నెట్‌ఫ్లిక్స్ సోమవారం కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి అవకాశం…. అంజి గెలవడంతో మొక్కు తీర్చుకున్న యువకులు ఆకాశంలో ఒక తార టీమ్‌కు చిరంజీవి, రామ్ చరణ్ అభినందనలు.. దుల్కర్ సినిమాపై ప్రశంసల వర్షం నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి రాయపాటి సాంబశివరావు మృతి టీడీపీకి తీరని లోటు విక్కుర్తి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం ఫాక్స్ సాగర్ బాధితులకు అండగా నిలుస్తామని ప్రకటన. ప్యాపిలిలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం వైకాపా సర్పంచి అభ్యర్థికి మద్దతుగా బుగ్గన అర్జున్ అమర్‌నాథ్ రెడ్డి ప్రచారం రాయపాటి సాంబశివరావుకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఘన నివాళి

రాయపాటి సాంబశివరావు మృతి టీడీపీకి తీరని లోటు విక్కుర్తి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి

Select Suryaa Now
రాయపాటి సాంబశివరావు మృతి టీడీపీకి తీరని లోటు  విక్కుర్తి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి
 
 
అవనిగడ్డ, నవంబర్ 29 మేజర్ న్యూస్: మాజీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు రాయపాటి సాంబశివరావు మృతి పట్ల అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి విక్కుర్తి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీతో పాటు రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విక్కుర్తి మాట్లాడుతూ.. రాయపాటి సాంబశివరావు ఆరుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ప్రజలకు విశేష సేవలందించారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని కొనియాడారు.
పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన రాయపాటి సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.✍️ అజంతా శ్రీనివాస్ అవనిగడ్డ కృష్ణాజిల్లా