నేడు మండలానికి మంత్రి రాక పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కనగల్ మేజర్ న్యూస్: మండలంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాని రాష్ట్ర రోడ్లు, భవనాలు , సినిమా ఆటోగ్రఫీ, టూరిజం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు గురువారం హాజరవుతున్నట్టు మండల బ్లాక్ కాంగ్రెస్, మండల పార్టీ అధ్యక్షులు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, గడ్డం అనూపూరెడ్డి బుధవారం ఒక ప్రకటన తెలిపారు. మండలంలోని ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి పనులకు (ఆలయ సుందరీ కరణ)కు రూ.1500 కోట్ల పనుల శంకుస్థాపన, నల్గొండ బైపాస్ నుంచి ధర్వేశిపురం, మంచి నీళ్ల బాయ్, చర్ల గౌరారం, సాగర్ రోడ్డు వరకు రూ. 37 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు, రూ. 21 కోట్లతో నల్గొండ మహబూబ్నగర్ రోడ్డు నుంచి మైల సముద్రం చెరువు మీదుగా చాలా గుడ్డి కూడా వరకు రోడ్లు విస్తరణకు, అదేవిధంగా ధర్వేశిపురం , కనగల్ మహిళా సంఘాల నూతన భవనాల ప్రారంభం, అనంతరం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో అభివృద్ధికి సంబంధించి సమీక్ష సమావేశం కనగల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు.