మొట్ట మొదటి మహిళ.. సీఎం కావాలంటూ అభిమానుల నినాదం!
సూర్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వేదికగా శుక్రవారం నిర్వహించిన 'పాంచజన్య సంకల్ప సభా ప్రాంగణంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మద్దతుగా అభిమానులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కవితక్క చిత్రంతో పాటు సింహం బొమ్మను ముద్రించిన పోస్టర్లను ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ‘మొట్ట మొదటి మహిళా ముఖ్యమంత్రి కవితక్క కావాలి’ అంటూ నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. కవిత నాయకత్వంపై తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ పోస్టర్లతో సందడి చేశారు.