BREAKING
ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక

మన పోలీస్ - మన ఊరు. * కార్యక్రమంలో భాగంగా హబ్సిపూర్ ప్రభుత్వ పాఠశాల సుందరీకరణ..

Select Suryaa Now
మన పోలీస్ - మన ఊరు.  * కార్యక్రమంలో భాగంగా హబ్సిపూర్ ప్రభుత్వ పాఠశాల సుందరీకరణ..

దుబ్బాక ..మన పోలీస్ - మన ఊరు కార్యక్రమంలో భాగంగా దుబ్బాక మండల పరిధిలోని  హబ్సిపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణను దుబ్బాక పోలీసులు సుందరంగా తీర్చిదిద్దారు.
ఇటీవల దుబ్బాక పట్టణ పర్యటనకు విచ్చేసిన పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్  హబ్సిపూర్‌ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను మరింత ఆహ్లాదకరంగా విద్యార్థులకు అనువుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆమె గుర్తించారు.
సీపీ ఆదేశాల మేరకు, మన పోలీస్ - మన ఊరు కార్యక్రమంలో భాగంగా దుబ్బాక పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాల ప్రవేశ ద్వారపు బోర్డుకు  ప్రహరీ గోడలకు కొత్తగా రంగులు వేయించారు. దీనివల్ల పాఠశాల ఆవరణ ఎంతో ఆకర్షణీయంగా విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే విధంగా రూపుదిద్దుకుంది.
ఈ సందర్భంగా  సీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ పాఠశాల విద్యార్థులకు భోజన ప్లేట్లను, ప్లాస్టిక్ రీసైకిల్డ్ పెన్సిళ్లను పంపిణీ చేశారు. పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగాఉంచుకోవాలని విద్యార్థులకు సూచించడంతో పాటు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే డయల్ 112  సేవల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. పోలీసుల సామాజిక సేవా కార్యక్రమాల పట్ల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక సీఐ రాజేష్ దుబ్బాక ఎస్సై కీర్తి రాజు మిరుదొడ్డి ఎస్సై సతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.