కోయగూడెం ఓసీలో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్–6
సూర్య టేకులపల్లి,కోయగూడెం ఓపెన్‌కాస్ట్ గనిలో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్–6 కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సోమవారం అధికారులు తెలిపారు. ఎన్విరాన్‌మెంట్ అధికారి .నరసింహారావు అధ్యక్షత వహించగా, ప్రాజెక్టు అధికారి. మాధవరావు, డీజీఎం (పర్సనల్) అజ్మీర తుకారాం లుమాట్లాడుతూ,స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, పరిసరాల పరిశుభ్రతపై, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సింగరేణి కార్యాలయాలు, గనులు, పని ప్రదేశాలు, పరిసర ప్రాంతాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా చెత్తాచెదారం పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలన్నా రు.అపరిశుభ్రతతో భద్రతకు ముప్పు,
పని ప్రదేశాల్లో పిచ్చిమొక్కలు, పొదలు పెరగడం, చెత్తాచెదారం పేరుకుపోవడం వల్ల పాములు, విషపురుగులు సంచరించే ప్రమాదం ఉందన్నా రు. దీనివల్ల కార్మికులు, ఉద్యోగుల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. అందువల్ల పొదలను ఎప్పటికప్పుడు తొలగించాలని, స్క్రాప్‌ను క్రమపద్ధతిలో నిల్వ ఉంచాలని, పని ప్రదేశాలను పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు.ఈ–వేస్ట్‌ను నిబంధనల ప్రకారం తరలించాలని,
వినియోగంలో లేని కంప్యూటర్లు, చిప్స్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (ఈ–వేస్ట్) నిర్లక్ష్యంగా పడవేయకూడదన్నారు. వాటిలో అవసరమైన డేటాను భద్రపరిచిన అనంతరం, నిబంధనల ప్రకారం స్క్రాప్ యార్డుకు తరలించాలని తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్య పరిరక్షణతో పాటు, సురక్షితమైన పని ప్రదేశాల ఏర్పాటుకు దోహదపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కెఓసీ మేనేజర్. శ్రీనివాస్, అరుణ్ దినకర్, యూనియన్ నాయకులు కె. వెంకటేశ్వర్లు, పలువురు అధికారులుపాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ దస్రు టేకులపల్లి