BREAKING
అర్ణబ్' తుఫాన్ హెచ్చరికలు: విద్యుత్ పునరుద్ధరణకు ముందస్తు ఏర్పాట్లు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహణ అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేదా? రాయదుర్గం పట్టణంలో 17వ వార్డులో కూటమి అభ్యర్థుల విస్తృత ప్రచారం* బాలిక కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు ఎక్సైజ్ కానిస్టేబుల్ వసూళ్ల దందా!? ఏమి గుండెరా అది రిజ్వాన్..! పదవులు కాదు.. హోదాలు కాదు.. పార్టీ గెలుపే పరమావధి! ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డిశంబరు 4-6 తేదీల్లో తిరుపతిలో డిజిపిలు,ఐజిపిల సమావేశం-ప్రధాని,హోంమంత్రి హాజరు జీవనధార ఫౌండేషన్ సేవా కార్యక్రమం ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి - ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి వినూత్నంగా సాగు చేయటం అలవాటు చేసుకోవాలి : సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి .టి.విజయ్ కుమార్ పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హైమావతి అహన్ పాండే కొత్త చిత్రానికి బెపర్‌వాహ్‌ టైటిల్ ఖరారు.. విడుదల తేదీ ప్రకటన! కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్

కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం... కొండగట్టు అంజన్న

Select Suryaa Now
కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం... కొండగట్టు అంజన్న

సూర్య మల్యాల:తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లతోపాటు మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి సైతం అంజన్న స్వామి కి భక్తులు ప్రతి ఏడాది లక్షలాది మంది తరలివచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మరి లక్షలాదిమంది వచ్చి దర్శనం చేసుకునే ఆలయం ఎక్కడుందో ఓసారి తెలుసుకుందామా మరి.. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు గుట్టపై ఆంజనేయ స్వామి ఆలయం కలదు. ఈ ఆలయం పురాణాల నుండే దీనికి ప్రాశ్యస్థత ఉంది.. కరీంనగర్ జగిత్యాల జాతీయ ప్రధాన రహదారి కరీంనగర్ నుండి 38కిలోమీటర్ల దూరంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఉంది. శ్రీరాముడు సీతమ్మ వారికి అగ్నిపరీక్ష పెట్టిన సమయంలో రావణుడు శ్రీరాముని సతీమణి సీతాదేవిని లంకకు తీసుకువెళ్లి బంధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సీతమ్మ వేటకు వెళ్లే క్రమంలో శ్రీరామ దూత ఆంజనేయస్వామి సీతమ్మ జాడకు వెళుతున్న క్రమంలో కొండగట్టు పై ఆగి శోధించాడని తెలుస్తోంది. ఆంజనేయ స్వామి ఆలయం వెనుక  పడమర వైపున బేతాళ స్వామి ఆలయం తోపాటు  శ్రీ రాములవారి పాదాలు గుహలు సీతమ్మ కన్నీటి దారలు.. వంటి పురాణ గాథలు కొండగట్టు పై వెలిశాయి. కొండల రాయుడు కొండ గుండు పైనుండి కిందికి దుంకించిన గుర్రం డెక్కలు దర్శనమిస్తాయి. గుండు పైన భోగాండానికి కొల్లిగుంట కలదు. రెండు ఎత్తయిన గుట్టల మధ్య లోతైన లోయలో సీతాదేవి మంచినీటి బావి వద్ద స్నానమాచరించారని పురాణాలుచెబుతున్నాయి. కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి నుండి కొండగట్టుకు వెళ్లేందుకురెండు వైపులా రహదారి ఉంది.సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తైన కొండపై ఆంజనేయ స్వామి ఉండడంతో కొండచుట్టు పచ్చని చెట్లు ఆహ్లాద వాతావరణం ఉంటుంది. ఈ చెట్ల పైన పక్షుల కిలకిల రాగాలు. 
వానరాలు చెట్లపై దూకుతూ చిందులేస్తున్న దృశ్యాలే ఇక్కడ నిత్యం దర్శనమిస్తాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం కు సుమారు22 ఎకరాల భూమి ఉంది. దీంతోపాటు ఆలయం పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ భూమితో పాటు అటవీ శాఖకు సంబంధించిన వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిలో పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.. ఆలయానికి వచ్చే నాచుపల్లి రహదారిలో జేఎన్టీయూ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల స్వర్గీయ డాక్టర్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది....

కొండగట్టు ఆలయం పై మౌలిక వసతులు.....

కొండగట్టు ఆలయం పరిసర ప్రాంతంలో ప్రవేశద్వారం పక్కనే భక్తులకు సేద తీరేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరిత హోటల్ ను నిర్మించారు.. అంజన్న ఆలయం కు ప్రతిరోజు సుమారు 2000 నుండి 3000 మధ్యన భక్తులు అంజనులు దర్శనం చేసుకుంటున్నారు. భక్తులు కొండగట్టుకు వచ్చే ముందు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. అనంతరం తిరిగి ధర్మపురి లోని పవిత్ర గోదావరిలో స్నానాలు ఆచరించి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకోవడం భక్తుల ఆనవాయితీగా వస్తుంది. అంజన్నకు ప్రీతికరమైన రోజు మంగళవారం.. దీంతో ప్రతి నెలలో మంగళవారం రోజున వేలాది మంది భక్తులు వచ్చి తాము కోరుకున్న కోరికలు తీర్చాలని ఆంజనేయ స్వామిని వేడుకుంటారు. ప్రతి మంగళ శనివారాలలో సుమారు 25 నుండి 30 వేల మధ్యన భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తమ మొక్కలను చెల్లించుకుంటున్నారు. ప్రతి ఏడాదిలో ఏప్రిల్ నెలలో చిన్న హనుమాన్ జయంతి మే నెలలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలను కొండగట్టు ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వైభవోపేతంగా కొనసాగుతాయి. చిన్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఆంజనేయ స్వామి మాల ధరించిన దీక్ష పరులు స్వాములు భక్తులు  తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండిసుమారు నాలుగు లక్షల దీక్షపరులు హాజరై మాలవిరమణ చేసుకొని అనంతరం అంజన్న స్వామిని దర్శించుకుంటారు. మాల ధరించిన స్వామి దీక్షపరులకు మాల విరమణకు ప్రత్యేక గదులను నిర్మించారు. గట్టుపై కొత్తగా కోనేరును నిర్మించారు. కోనేరులో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. ఉత్సవాలకు వచ్చే దీక్షాపరులు భక్తుల కోసం మంచినీరు టాయిలెట్స్ చలువ పందిర్లు దీక్షాపరులకు ప్రత్యేకమైన గదులు భక్తులకు దర్శనం అనంతరం ప్రత్యేకమైన లడ్డు ప్రసాదాల కౌంటర్లు ఆ సమయంలో ప్రత్యేకంగా కేటాయిస్తారు....

 

మాస్టర్ ప్లాన్ తో ఆలయం మరింత అభివృద్ధి..

భక్తుల కోసం కొండగట్టు పై అన్ని ఏర్పాట్లు...
ఆలయ కార్యనిర్వహణ అధికారి అంజనా  రెడ్డి..కొండగట్టు పై మాస్టర్ ప్లాన్ తో ప్రత్యేకమైన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయనుందని ఆలయ ఈవో అంజనా రెడ్డి తెలిపారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన అంశాలను పలు శాఖల అధికారులతో ప్రస్తావించి కొండగట్టుకు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించారు.ప్రతినిత్యం కొండగట్టుకు వచ్చే భక్తుల కోసం మంచినీటి సౌకర్యంతో పాటు మౌలిక వసతులను అన్ని ఏర్పాట్లు చేసామని ఆలయ ఈవో తెలిపారు...

 

పౌర్ణమి రోజున ఘనంగా గిరి ప్రదక్షణ..

గిరి ప్రదక్షణ వ్యవస్థాపకులు సురేష్ ఆత్మారాం మహారాజ్..

గిరిప్రదక్షిణ వ్యవస్థాపకులు చిలుకూరి ప్రధాన ఉప అర్చకులు సురేష్ ఆత్మరామ్ మహారాజ్ ఆధ్వర్యంలో కొండగట్టు ఆలయ గిరి ప్రదక్షణను 2023 మే నెల ఐదున వందమందితో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ గిరి ప్రదక్షణకు సుమారు 50000 మంది భక్తులు పాదయాత్ర చేస్తున్నారు. ఈ గిరి ప్రదక్షణ ప్రతి నెలలో పౌర్ణమి రోజున ఉదయం 6 గంటలకు కొండగట్టు కింది గుట్ట నుండి గట్టుపై ఉన్న వై జంక్షన్ వద్ద నుండి జేఎన్టీయూ కి వెళ్లే రహదారిలో బేతేలు ఆలయం పక్కనుండి రెండు గుట్టల మధ్యన లోతైన ప్రాంతం నుండి సీతమ్మ భావి బావి ఉన్న ప్రాంతం నుండి ఆలయం చుట్టూ కింద కొండగట్టు బస్ స్టాప్ వద్దకు సుమారు 9 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణను భక్తులు పాదయాత్రగా నడిచి పూర్తి చేస్తున్నారు. ఈ పాదయాత్రకు ప్రతి నెలలో సుమారు 20 నుండి 25 వేల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసి అంజన్న స్వామి మొక్కలు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం సమాజంలో హిందువులంతా ఒక్కటై కలిసికట్టుగా ఒక్క తాటిపై నడవాలి. దేవాలయాలు ధర్మం రక్షించబడాలి. గోమాతను పూజించాలి. దేశభక్తి దైవభక్తి ధర్మాన్ని కాపాడేందుకే ఈ గిరి ప్రదక్షణ ప్రారంభించామని తెలిపారు. శ్రీ సీతారామ చంద్రులు సూర్య భగవానులు ఆంజనేయస్వామిని ఎప్పటికీ చిరంజీవి గా ఉండాలని ఆశీర్వదించారని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయని అన్నారు. ఆంజనేయస్వామిని దర్శించుకుంటే బుద్ధిబలం వాక్చాతుర్యం శక్తిని ప్రసాదిస్తాయని అన్నారు. తమిళనాడులోని అరుణాచలం శివాలయం ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంlo ఇది ప్రదక్షిణలు జరుగుతున్నాయని తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ గిరిప్రదక్షిణ ప్రారంభించామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రతి పల్లెలో ఉన్న కొండపైనున్న ప్రస్తుతం18 ఆలయాలలో గిరి ప్రదక్షిణలు జరుగుతున్నాయని అన్నారు...

రామకోటి నిర్మించిన బిఆర్ఎస్ ప్రభుత్వం..
కొండగట్టు ఆలయం పై అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వంమాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రామకోటి స్థూపాన్ని మాజీ ఎమ్మెల్సీ కవిత దగ్గర ఉండి పనులను పర్యవేక్షించి అందంగా తీర్చిదిద్ది నిర్మించారు..