telangana
కూచిపూడి పోటీల్లో సిరిసిల్ల చిన్నారి సత్తా
సూర్య రాజన్న సిరిసిల్ల ;కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక వనరుల కేంద్రం హైదరాబాద్‌లో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీల్లో సిరిసిల్లకు చెందిన చిన్నారి కుమారి అభిజ్ఞ సత్తా చాటింది. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి పాల్గొన్న కళాకారుల్లో బాలా త్రిపుర సుందరి నాట్య విద్యాలయం తరఫున పాల్గొని 4వ స్థానంలో నిలిచింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ చిన్నారి అభిజ్ఞను అభినందించారు.మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.