కోహెడను ఆదర్శ గ్రామంగా నిలపడంలో భాగస్వాములు కావాలని గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్
కోహెడ ; కోహెడ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా మరియు సుందరీకరణ దిశగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా నేడు గ్రామంలోని అంబేద్కర్ సంఘం సమీపంలో ప్రత్యేక పారిశుద్ధ్య, పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్, పంచాయతీ సెక్రటరీ సురేందర్, ఉపసర్పంచ్ కందాల వెంకటేష్, వార్డు సభ్యులు చుక్క శంకర్, గజ్జెల ప్రవీణ్, నంగునూరి కిరణ్, జలిగం స్వప్న బాలరాజు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ పరిసరాలను తాత్కాలిక షెడ్లను వెనక్కి జరిపించి అలాగే పరిసరాలను విశాలంగా, శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు కొనియాడారు. ఇట్టి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గ్రామ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.