telangana
కవ్వాల్ లో జీవిత బీమా పథకం ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభించిన సర్పంచ్ సక్రు నాయక్
సూర్య, జన్నారం : జన్నారం మండలం కవ్వాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్లైన్ దరఖాస్తును బుధవారం కవ్వాల్ సర్పంచ్ సక్రు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సక్రు నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం లక్ష్యమనే ఆలోచనతో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు మధ్య గలవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని అన్నారు. ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది నామినీలను ఎంపిక చేసుకోవచ్చని, అర్హత కలిగిన ప్రతి కుటుంబం తప్పనిసరిగా జీవిత బీమా చేసుకోవాలన్నారు. ఈ శిబిరంలో విలేజ్ ప్రెసిడెంట్ పొడేటి మల్లేష్, గుమ్ముల సత్తయ్య, ఎజాసోద్దీన్, వంగ శ్రీనివాస్, సతీష్, ముజ్జు, రాకేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.