కౌలు రైతులను ఆదుకోవాలి వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి కుమార్
మునిపల్లి;ఎల్ నినో కారణంగా పంటలు దిగుబడి రాక కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందుకు ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ జిల్లా సహాయ కార్యదర్శి కుమార్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని బుసారెడ్డిపల్లి గ్రామంలో కౌలు రైతులకు సంబంధించి సాగు చేసిన భూములను పరిశీలించి స్వయంగా రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్ నినో కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ఎకరానికి రూ.50వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను పొడగించి కొత్త రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.