telangana
కరీంనగర్ న్యాయ చరిత్రలో చిరస్మరణీయం - రామ్ జెఠ్మలానీ విగ్రహావిష్కరణ
సూర్య కరీంనగర్ : కరీంనగర్‌లోని జస్టిస్ కుమారయ్య కాలేజ్ ఆఫ్ లా ప్రాంగణంలో ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి దివంగత రామ్ జెఠ్మలానీ విగ్రహాన్ని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శనివారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పుల్లిచెర్ల సామ్ కోషి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్, రామ్ జెఠ్మలానీ కుమారుడు, రాజ్యసభ సభ్యుడు మహేశ్ జెఠ్మలానీ, సీనియర్ జర్నలిస్టు స్వామినాథన్ గురుమూర్తి పాల్గొన్నారు. రామ్ జెఠ్మలానీ న్యాయరంగానికి చేసిన సేవలు, నిర్భయమైన వాదనా పటిమ, రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధతను ప్రముఖులు స్మరించుకున్నారు. ఈ విగ్రహం న్యాయ విద్యార్థులు, యువ న్యాయవాదులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కె. జలజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, న్యాయవాదులు పూరెల్ల రాములు, సుంకే దేవకిషన్, బెజ్జంకి శ్రీకాంత్, పి. అనురాధ, గౌరు రాజిరెడ్డి, పెరుక రంగయ్య, భూక్య రజనీష్, ఏ. కిరణ్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది, న్యాయ విద్యార్థులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు.