జేఏసీ చైర్మన్‌గా ఎన్నికైన భూమన్నకు బిజెపి నాయకులు సన్మానం
సూర్య జైపూర్: జైపూర్ జర్నలిస్టుల సంఘంలో కీలక బాధ్యతలు చేపట్టిన దుస్స భూమన్నకు జైపూర్ మండల బీజేపీ నాయకులు అభినందనలు తెలిపారు. మండల జర్నలిస్టుల జేఏసీ చైర్మన్‌గా, టీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా బీజేపీ మండల ఇన్‌ఛార్జి మంత్రి రామన్న, పెగడపల్లి సర్పంచ్ రామగిరి రాము, బీజేవైఎం మండల అధ్యక్షుడు పల్లికొండ వెంకటేష్, మండల ఉపాధ్యక్షుడు రాజబత్తుల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.అనంతరం భూమన్న మాట్లాడుతూ జర్నలిస్టుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధించడమే తన ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు.