BREAKING
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కరాటే విద్యార్థులకు బెల్టు గ్రేడింగ్స్ ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తాజానిపై సైబర్ దాడి ట్రెండ్‌కు తగినట్లుగా నిఖిల్ కొత్త రూపం: 'అలియాస్ రుక్మిణి' చిత్రంలో యువ కృష్ణుడిగా అదరగొడుతున్న హీరో గన్నవరం ..గరం..గరం.. రాజాం కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ అభివృద్ధి,సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారు....ఎంఎల్ఏ " కోండ్రు " గీతంలో సి.వి.రామన్ 138వ జయంతి భారత్‌లో కోకాకోలా బాట్లింగ్ దిగ్గజం ఐపీఓ దరఖాస్తు కజకిస్థాన్‌లో విక్టరీ వెంకటేశ్, కళ్యాణ్ రామ్ 'జనవరి 12 విడుదల' షూటింగ్: అనిల్ రావిపూడి హైఓల్టేజ్ ప్లాన్ తిమ్మాపూర్‌లో వృద్ధురాళ్ల వరుస హత్యల కేసు ఛేదన రూ. 45 వేల కోట్ల డీల్‌ను రక్షించేందుకు సాఫ్ట్‌బ్యాంక్, ఎబిబి కసరత్తు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల చారిత్రాత్మక విజయం పల్లె పోరులోటిడిపి ఘనవిజయం నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవి ముస్లింకు కేటాయించండి.

ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం.. సొంతింటి భరోసాః మంత్రి సీతక్క

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం.. సొంతింటి భరోసాః మంత్రి సీతక్క

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః పేదల సొంతింటి కలను నెరవేర్చి, వారికి ఆత్మగౌరవంతో కూడిన జీవనానికి భరోసా కల్పించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ప్రతి పేద కుటుంబం సొంతింట్లో సంతోషంగా పండుగలు జరుపుకోవాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. శనివారం సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామంలో లబ్ధిదారుడు ఈసం నాగరాజు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు జరుపుకొని, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదల గృహ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈసం నాగరాజు కుటుంబం సొంతింట్లో పండుగ జరుపుకుంటున్న ఆనందాన్ని పంచుకోవడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. గతంలో గవర్నర్‌గా పనిచేసిన జిష్ణుదేవ్ వర్మ కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకొని, మహిళల అభ్యున్నతికి, గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారని మంత్రి గుర్తుచేశారు. గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, ఇళ్లు లేని పేదలకు సొంతింటి వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతి కుటుంబానికి సొంతింటి భరోసా కల్పించి, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కొండపర్తి గ్రామస్తులకు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, సునీల్, కల్తి రమేష్, గ్రంథాలయ సంస్థ, పీఏసీఎస్ ప్రతినిధులు, తాజా, మాజీ సర్పంచులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.