సూర్య కరీంనగర్ : కరీంనగర్‌లో ఈ నెల 23న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేపట్టనున్న పాదయాత్రకు ముందు హల్ద్వానీ ఘటనపై బీజేపీ జాతీయ నాయకత్వం దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే పాదయాత్రను అడ్డుకుంటామని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ హెచ్చరించారు. మల్లికార్జున ఖర్గే సమావేశ ప్రాంగణాన్ని అపవిత్రమంటూ శుద్ధి చేయడం దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని విమర్శించారు. బండి సంజయ్ స్పందించకపోవడంపై ప్రశ్నిస్తూ, దమ్ముంటే దళితవాడల్లో పాదయాత్ర చేయాలని, లేదంటే అంబేద్కర్ విగ్రహం వద్ద క్షమాపణ చెప్పాలని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ తాజుద్దీన్, అబ్దుల్ రహమాన్, ఆరెపల్లి రాహుల్, కంపెళ్లి కీర్తి కుమార్, రెడ్డి గారి రాజు, దండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.