BREAKING
కమలం గుర్తుకు ఓటెయ్యండి - బిజెపి నేత కోలా ఆనంద్ ప్రతిష్టాత్మక 'ఏబీయూ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్' అవార్డు కైవసం! జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపునకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ ఈటల రాజేందర్‌ ఏలూరు నగర అభివృద్ధికై బ్లాక్ బోర్డు గుర్తుకు ఓటెయ్యండి టిడిపి, జనసేన, బిజెపి పార్టీల అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించాలి -- విలేకరుల సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు సేవ గుణం. చాటుకున్న ఉపాధ్యాయుడు. తన జీతం డబ్బులతో ముప్పై వేల రూపాయలు పిల్లలకు వైట్ డ్రస్ లు. టీనేజర్ల మానసిక ఆరోగ్య వ్యాజ్యాల విచారణ సమయంలోనే మెటా కీలక సెటిల్మెంట్! కాశ్మీరీల తరఫున మాట్లాడిన బ్రిటిష్ కౌన్సిలర్ దాలత్ అలీని అడ్డుకున్న పాక్ అకాల వర్షంతో అన్నదాతల్లో ఆందోళన.. మేడ్చల్‌ పరిసరాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ… కూటమి అభ్యర్థులను గెలిపించండి - మంత్రి పార్థసారథి అభ్యర్థన మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు తిరుపతి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ చైనా రక్షణ రంగంలో యుద్ధనౌకపై నుంచి తొలిసారిగా స్టీల్త్ అటాక్ డ్రోన్ టేకాఫ్ మరియు ల్యాండింగ్! ఢిల్లీ వాసులకు ఊరట: 'సంతృప్తికరం' కేటగిరీలోకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తుఫాను బాధితులకు అండగా ఉందుర్తి పాల్ ఫౌండేషన్ జీ-20 సదస్సులో రష్యా మంత్రి రాకతో నిలిచిపోయిన సంప్రదాయ గ్రూప్ ఫోటో!

హాలియా పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..

Select Suryaa Now
హాలియా పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..

 

 

హాలియా మేజర్ న్యూస్.
హాలియా పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్  ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్‌లోని విధులు, రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పోలీస్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు అందుతున్న సేవలు, సిబ్బంది స్పందిస్తున్న తీరు, స్టేషన్ నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను పరిశీలించారు.

పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమీక్షిస్తూ ప్రతి కేసులో నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి, నాణ్యమైన ఆధారాలతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా  కేసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, అక్రమ కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని, అనుమానిత వ్యక్తుల కదలికలను గమనిస్తూ నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను ఓపికగా విని చట్టపరిధిలో పరిష్కరించాలని తెలిపారు. గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలు పోలీసులపై నమ్మకం కలిగే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు వాహనాల తనిఖీలు నిర్వహించి దొంగతనాలు, ఇతర నేరాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఇంచార్జ్ డిఎస్పీ రవి, హాలియా సీఐ రాఘవరావు,ఎస్.ఐ సాయి ప్రశాంత్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.