BREAKING
గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు వేదిక బాలల దినోత్సవం నిత్యావసర వస్తువుల ధరలు, నిల్వలు, సరఫరాపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు వాకథాన్, ఉచిత మధుమేహ పాద పరీక్ష శిబిరం జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గ్రంథాలయంలో బాలల దినోత్సవ వేడుకలు! నూతన పింఛన్ల పత్రాల పంపిణీ చేసిన సర్పంచులు పేద విద్యార్థులకు పలకలు ,పుస్తకాలు పంపిణీ పేద విద్యార్థులకు పలకలు ,పుస్తకాలు పంపిణీ ప్రముఖ సీనియర్ నటుడు, దర్శక నిర్మాత గిరిబాబు మరణం విచారకరం హైవేపై మృత్యుపాశంలా మారిన మరమ్మతు వాహనం 20 రోజులుగా పట్టించుకోని అధికారులు ఘనంగా నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా వేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకలకు సర్వం సిద్ధం పంటల పరిశీలన.. రైతులకు శాస్త్రవేత్తల సూచనలు! కొమరోలులో కృషోన్నతి యోజన కార్యక్రమం పరిశ్రమలు, ప్రకృతి సందర్శనలతో విద్యార్థులకు విజ్ఞాన యాత్ర

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలి

Select Suryaa Now
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు.. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలి

సంగారెడ్డి, ప్రతినిధి :-పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని సాధించవచ్చని, సమాజ అభ్యున్నతికి గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య అన్నారు.59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శనివారం సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని,  వారోత్సవాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ అంజయ్య మాట్లాడుతూ.. గ్రంథాలయాలు కేవలం పుస్తకాలు చదివే ప్రదేశాలు మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని అందించే కేంద్రాలని అన్నారు. పుస్తక పఠనం మనిషిలో ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను, సమాజం పట్ల అవగాహనను పెంపొందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనానికి ఉన్న ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని, మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా మంచి పుస్తకాలను చదివే అలవాటును ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.గ్రంథాలయాల ద్వారా అందించే విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు యువత, విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, పుస్తక ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మనోజ్ కుమార్, గ్రంథాలయ సిబ్బంది,యువత, విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు.