గిట్టుబాటు ధర కల్పించేందుకే... -ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు -ఎమ్మెల్యే కవ్వంపల్లి
బెజ్జంకి/మేజర్ న్యూస్:
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం కొనుగోలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.మండల పరిధిలోని దేవక్కపల్లి,దాచారం గ్రామాలలో సింగిల్ విండో,ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్,సర్పంచులు నేరెళ్ల వెంకటలక్ష్మి,బైర మానసలతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.రైతులు పండించిన వరి ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు.కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సెంటర్ నిర్వాహకులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సూచించారు.ఏఎంసి చైర్మన్ మాతంగి శిరీష,వైస్ చైర్మన్ పర్శ సంతోష్,కాంగ్రెస్ మండలాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్,కాంగ్రెస్ మాజీ మండలాధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,మాజీ ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ,చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,ఒంటెల సంపత్ రెడ్డి,జెల్ల ప్రభాకర్,గండికోట సురేష్,కుంట హరికృష్ణ,కుక్కల రాములు,మాతంగి భాస్కర్,మెండే నవీన్,గుర్రం రాజిరెడ్డి,సెంటర్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.(సూర్యరిపోర్టర్,బెజ్జంకి)