telangana
ఘనంగా...శ్రీ మైసమ్మ తల్లి తెప్పోత్సవం
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : నిజామాబాద్ లోని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు జన్నెపల్లి గస్ట్ హౌస్ లో నిర్వహించిన శ్రీ మైసమ్మ తల్లి తెప్పోత్సవ కార్యక్రమంలో మౌలాలి డివిజన్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్, మల్కాజిగిరి కాంగ్రెస్ సీనియర్ నేత జీఎన్ వీ సతీష్ కుమార్, కాకతీయ నగర్ 187వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతమల్ల కపిలేశ్వర్, బాల రాజు యాదవ్ తదితరులు పాల్గొని, అమ్మ వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సంద ర్భంగా మైనంపల్లి హన్మంతరావుతో పాటుగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.