BREAKING
ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక

ఎన్నికల హామీ ప్రకారం ఆశా వర్కర్లకు... * రూ.18,000/-లు ఫిక్స్ డ్ వేతనం ఇవ్వాలి...

Select Suryaa Now
ఎన్నికల హామీ ప్రకారం ఆశా వర్కర్లకు...  * రూ.18,000/-లు ఫిక్స్ డ్ వేతనం ఇవ్వాలి...

దుబ్బాక …దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమ్మె నోటీసు ఇస్తున్న ఆశ వర్కర్లు అనంతరం  సి ఐ టి యు జిల్లా కోశాధికారి గొడ్డుబర్ల భాస్కర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఆశ వర్కర్లకు ఫిక్స్ డు వేతనం 18000 రూపాయలు నిర్ణయించాలని పీఎఫ్,ఇఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఆశా వర్కర్లు నిరంతరం బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలందిస్తున్నారనీ గర్భిణీలు ఆసుపత్రిలో డెలివరీ అయ్యే విధంగా చూస్తూ తల్లి,బిడ్డ ప్రాణాలను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారనీ తెలిపారు.సీజనల్,వ్యాధులు,అంటువ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.ఏఎన్సీ, పిఎన్సి, టార్గెట్స్, ఎన్సిడి ఆన్లైన్ సర్వే, స్పూటమ్ డబ్బాలను మోయడం,ఎగ్జామ్ డ్యూటీలు, డ్రైడే, ఫ్రైడే లెప్రసీ, పల్స్ పోలియో తదితర అనేక పనులు ప్రతి రోజూ నిర్వహిస్తున్న వీరికి ఏ సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశాలకు వేతనాలు 18000 రూపాయలకు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీనిచ్చి నేటి వరకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఆశలను మోసం చేస్తున్నారని విమర్శించారనీ.ఆశాలకు రూ.18,000/-ల ఫిక్స్డ్ వేతనం. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలనీ,రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.50,000/-ల మట్టి ఖర్చులను వెంటనే నిర్ణయించాలనీ,రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలి.పారితోషికాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలి.ఏఎన్ఎం, జిఎన్ఎం ట్రైనింగ్ చేసిన ఆశాలకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలనీ డిమాండ్ ల పరిష్కారం కొరకు 2026 డిసెంబర్ 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే  ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సి ఐ టి యు అనుబంధ ఆశ వర్కర్స్ యూనియన్ సిద్ధిపేట జిల్లా కోశాధికారి  భాగ్యలక్ష్మి,భాలమణి, కవిత,శారద,లత, సంతోషి,చంద్రకళ,స్వరూప,లావణ్య,లక్ష్మీ,రేణుక, అరుణ, నవనీత, పొచవ్వ,తదితరులు పాల్గొన్నారు.