ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
కొల్చారం;దసరా పండుగను పురస్కరించుకుని కొల్చారం మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు ఎమ్మెల్యేతో ఆత్మీయంగా ముచ్చటించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కలయికతో నాయకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో కొల్చారం మాజీ సర్పంచ్ కరెంట్ రాజా గౌడ్, ఉప సర్పంచ్ కోరంపల్లి రాణి గోపి, మాజీ ఉప సర్పంచ్ చిన్న రాములు, చెన్నయ్య, కృష్ణ, అంజనిపుత్ర, వార్డు సభ్యులు నేరెళ్ల సత్యనారాయణ, చింతల కృష్ణ, వనమాల శ్రీధర్, ఎర్రోళ్ల శ్రీను, అరికెల నాగయ్య, ఆశన్నగారి ఆంజనేయులు, శేఖర్, పెద్దపురం అశోక్, నింగోల లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.