ఎంపీటీసీ వైయస్సార్సీపి అభ్యర్థిగా పోటీ చేయనున్న ధూళిపూడి కృష్ణవేణి
కొయ్యలగూడెం. , రూరల్ మేజర్ న్యూస్ :స్థానిక ఎన్నికల సందర్భంగా మండలంలో బోడిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా వైయస్సార్ పార్టీ నుండి బోడిగూడెం గ్రామానికి చెందిన ధూళిపూడి బాబురావు భార్య కృష్ణవేణి గురువారం ఎంపీడీవో కార్యాలయం వద్ద నామినేషన్ వేయడం జరిగింది. ఈమెను ఎంపీటీసీ అభ్యర్థిగా మాజీ ఎంపీటీసీ సభ్యులు డేవిడ్ కింగ్ బల పరచడం జరిగింది. ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి నాయకులతో, అధికారులతో కలసి తాను పనిచేస్తానని తెలిపారు. గురువారం ఉదయం ఆమె నివాసం వద్ద నుండి భారీగా ర్యాలీతో నాయకులతో కార్యకర్తలతో కలిసి మండల పరిషత్తు కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జొన్నకుటి దొరబాబు, ఏలేటి చంద్రం, షేక్ బాజీ, మాజీ వైస్ ఎంపీపీ తుమ్మలపల్లి గంగరాజు, చిటికెన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.