BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

పాడి రైతులకు తక్కువ ధరకు పశుదాణా.. నెలకు 300 టన్నుల సరఫరాకు కలెక్టర్ కసరత్తు.

Select Suryaa Now
పాడి రైతులకు తక్కువ ధరకు పశుదాణా..   నెలకు 300 టన్నుల సరఫరాకు కలెక్టర్ కసరత్తు.

అమలాపురం మేజర్ న్యూస్ పాడి రైతులకు సరసమైన ధరలకు నాణ్యమైన పశుదాణా అందించడమే లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో పశుసంవర్ధక శాఖ అధికారులు, పశుదాణా తయారీ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారుజిల్లాలో పశుదాణాకు ఉన్న డిమాండ్‌, ప్రస్తుత మార్కెట్ ధరలు, తయారీ వ్యయాలు, ముడి సరుకుల లభ్యత తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని పాడి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నెలకు సుమారు 300 మెట్రిక్ టన్నుల పశుదాణా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు మార్కెట్‌లో పశుదాణా ధరలు అధికంగా ఉండటంతో రైతులపై ఆర్థిక భారం పడకుండా తక్కువ ధరకు నాణ్యమైన దాణా అందించే మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు. అవసరమైతే మాష్ రూపంలో దాణా సరఫరా చేయడం ద్వారా తయారీ వ్యయాన్ని తగ్గించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
నాణ్యతకు పెద్దపీట ;పశుదాణాలో ప్రోటీన్‌, కొవ్వు, పీచు పదార్థాలు నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉండేలా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రయోగశాల పరీక్షల ద్వారా నాణ్యతను నిర్ధారించిన పశుదాణాను మాత్రమే రైతులకు సరఫరా చేయాలని ఆదేశించారు. ధర తగ్గించే ప్రయత్నంలో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని పేర్కొన్నారు.
స్థానికంగా తయారీ యూనిట్ల ఏర్పాటుకు కసరత్తు :ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌), స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) భాగస్వామ్యంతో జిల్లాలో చిన్న తరహా పశుదాణా తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తూ స్థిరమైన ధరలకు నాణ్యమైన పశుదాణాను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను, తయారీ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డా. ఎల్. అనిత, డీడీ, అమలాపురం; డా. ఓ. రామకృష్ణ, ఏడీ, ఆర్‌సీపీఎం; డా. బీవీవీ సత్యనారాయణ, ఏడీ, ఆలమూరు; ఎ. వర ప్రసాద్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, కోఆపరేటివ్ డిపార్ట్‌మెంట్; పి. బాబు ప్రసాద్, ఆర్.ఐ.; డా. బి.ఆర్.వి.ఎస్. రావు, ఏడీసీ ఏహెచ్ మచిలీపట్నం; డా. ఎన్. రవీంద్ర కుమార్, వీఏఎస్/వీడీవో, మలికిపురం; డా. జి. రాజా శ్రీనివాస్, వీఏఎస్/వీడీవో, పుల్లలచెరువు; మట్టా మాతలక్ష్మి ప్రభాకరరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు, రోళ్లపాలెం తదితరులు పాల్గొన్నారు