అభాగ్యురాలైన నిండు గర్భిణీకి ఆసరాగా నిలిచిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్
ఏలూరు, మేజర్ న్యూస్ : ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలతో ఏలూరు వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు. అక్కడ నుంచి హనుమాన్ జంక్షన్ లో సంరక్షణకు తరలింపు కొరకు ఏర్పాట్లు చేశారు.అనాథలకు, నిస్సహాయుల కు ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎప్పుడూ అండగా ఉంటుందని జిల్లా 'శక్తి' టీమ్ సభ్యులు మరోసారి నిరూపించారు. మతిస్థిమితం సరిగా లేని ఒక నిండు గర్భిణీ స్త్రీ ఏలూరు రామకోటి సెంటర్ ఎదురుగా దయనీయ స్థితిలో జీవిస్తున్న విషయాన్ని గుర్తించిన వారు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ కి సమాచారం అందజేశారు .ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్పీ ఆదేశాల మేరకు 'శక్తి' టీమ్ సభ్యులు ఆ అభాగ్యురాల ను సురక్షితంగా రక్షించి వసతి కల్పించారు.
ఏలూరు కొత్త బస్ స్టాండ్ ప్రాంతంలో నిండు గర్భిణీగా ఉంటూ, మతిస్థిమితం లేకుండా ఇబ్బంది పడుతున్న మహిళ దుస్థితి పై జిల్లా ఎస్పీ కి సమాచారం అందింది.
స్పందించిన జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ వెంటనే అభాగ్యురాలికి తగిన వైద్యం రక్షణ కల్పించాలని 'శక్తి' టీమ్‌ను ఆదేశించారు.
ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే అప్రమత్తమైన శక్తి టీమ్ సిబ్బంది ఆ గర్భిణీ మహిళ ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు.
నిండు గర్భిణీగా ఉన్న ఆ మహిళ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, ఎటువంటి అభద్రతా భావానికి గురికాకుండా ఆమెను సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.
సదరు మహిళ వివరాలు తెలియ చేయలేని పరిస్థితుల్లో ఉన్న కారణంగా ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించే కార్యక్రమం చేపట్టారు. అదే విధముగా ఆమె వివరాలను సేకరించుట కొరకు పోలీసు వారు ప్రయత్నం చేస్తున్నారు.
బాధితురాలికి తక్షణ రక్షణ , వసతి కల్పించే ఉద్దేశంతో ఆమెను తొలుత ఏలూరులోని వన్‌స్టాప్ సెంటర్ కు తరలించారు. వన్ స్టాప్ సెంటర్ లో ఆమెకు అవసరమైన ప్రాథమిక వైద్య పరీక్షలు , ప్రత్యేక పోషకాహార ఏర్పాట్లను అధికారుల సమక్షంలో పర్యవేక్షించారు.
మెరుగైన దీర్ఘకాలిక వసతి, రక్షణ పునరావాసం కల్పించడం కోసం హనుమాన్ జంక్షన్ లోని ప్రత్యేక ఎన్జీవో హోమ్‌కు ఆమెను తరలించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
కష్టకాలంలో ఉన్న ఒక గర్భిణీ అభాగ్యురాలిని చేరదీసి, అండగా నిలిచిన ఏలూరు జిల్లా పోలీసు యంత్రాంగం మరియు శక్తి టీమ్ సభ్యుల మానవతా స్థానికులు, ప్రజాలు అభినందించారు.