BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

వైసీపీ నుండి జనసేన లోనికి భారీగా చేరికలు

Select Suryaa Now
వైసీపీ నుండి జనసేన లోనికి భారీగా చేరికలు

ఉండి, మేజర్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉండి మండలంలో జనసేన పార్టీలోనికి వైసీపీ నుండి భారీగా చేరికలు ఊపందుకున్నాయి. ఉండి మండలం ఎన్‌ఆర్‌పీ అగ్రహారం మాజీ సర్పంచ్, వైసిపి సీనియర్ నాయకులు  మునుకోలు సింహాచలం ఆధ్వర్యంలో బీసీ కాలనీకి చెందిన సుమారు 80 మంది యువత గురువారం జనసేన పార్టీలో చేరారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పీవీఎల్ నరసింహరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన యువతకు నాయకులు జనసేన కండువాలు కప్పి సాదరంగా జనసేన పార్టీ లోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మునుకోలు సింహాచలం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి ఆకర్షితులై బీసీ కాలనీ యువతతో కలిసి జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. అనంతరం పీవీఎల్ నరసింహరాజు, జుత్తిగ నాగరాజు మాట్లాడుతూ పార్టీలో చేరిన యువతకు పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని మునుకోలు సింహాచలం సహచర నాయకుల సమన్వయంతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు, బీసీ కాలనీ యువత పాల్గొన్నారు.