కొమరం భీమ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి..
బుట్టాయిగూడెం: మేజర్ న్యూస్: గిరిజనుల అభ్యున్నతికి పాటుపడిన కొమరం భీమ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఐటీడీఏ పీవో కే రాములు నాయక్ తెలిపారు. మండలంలోని కోట రామచంద్రపురం ఐటీడీఏ వద్ద
కొమురం భీమ్ 127వ జయంతి సందర్భంగా గురువారం కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పిఓ రాములు నాయక్ మాట్లాడుతూ గిరిజన హక్కుల సాధన కోసం కొమురం భీమ్ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి అని చెప్పారు. కొమరం భీమ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ పి. జగన్నాథరావు, ఎ.యమ్.ఓ.కె.సిరమయ్య, యస్.సి, యస్.టి, విజులేన్స్ మోనిటరింగ్ కమిటీ మెంబర్ యస్.ముక్కయ్య, ఆదివాసి, జె.ఎ.సి వైస్ చైర్మన్ కె.దుర్గారావు తదితరులు ఉన్నారు.