BREAKING
మర్రిపాడులో నిలువ నీడ కరువాయే..! ఎండలోనూ, వానలోనూ నిల్చుండాల్సిందే మహిళలకు మరుగుదొడ్లు కరువు ఆసియా మార్కెట్లలో దూకుడు: కోస్పీ 5%, నిక్కీ 3% అప్ గిరిజన రైతులకు వాణిజ్య పుట్టగొడుగుల సాగుపై శిక్షణా కార్యక్రమం ఎన్నికల కౌంటింగ్ దౌర్జన్యం పై కళ్యాణదుర్గం పట్టణంలో నిరసన ర్యాలీ. విడాకులయితే లోరీ మిల్స్‌కు $60 బిలియన్లు?: ఎన్విడియా ఆస్తుల లెక్కలు చికిత్స పొందుతూ ఒకరు మృతి రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీలకు వనాలిక ఎంపిక జేఎన్‌టీయూఏలో ఐదు రోజుల అధ్యాపక శిక్షణ.. ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వల గావించిన ఉపకులపతి ఆచార్య హెచ్ సుదర్శన్ రావు స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు! కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిసిన పాసి గంగుపేట ఎంపీటీసీ బత్తల త్రివేణి రేపు శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి హుండీల లెక్కింపు ముడి చమురు ధరల్లో భారీ పతనం: బ్యారెల్ $92 వద్ద బ్రెంట్ అంతరాబ, అచ్చుతాపురంలో హోరెత్తిన టీడీపీ ఎన్నికల ప్రచారం నూతనంగా ఎన్నికైన ఎంపిటిసి సభ్యులకు ధృవ పత్రాలు పంపిణీ బంగారం కంటే గోల్డ్ ఈటీఎఫ్‌లే మేలు: నిపుణులు

ఏఐకేఎస్ మహాసభను జయప్రదం చేయండి

Select Suryaa Now
ఏఐకేఎస్ మహాసభను జయప్రదం చేయండి

మహబూబాబాద్ , మేజర్ న్యూస్, ఈ నెల 15న నల్గొండ లో జరిగే అఖిల భారత కిసాన్‌ ‌సభ మహాప్రదర్శన, బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గునగంటి రాజన్న పిలుపునిచ్చారు.మంగళవారం రైతు సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గునగంటి రాజన్న, జిల్లా కోశాధికారి ఆకుల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు నల్లపు సుధాకర్లు  మాట్లాడుతూ 15న జరిగే బహిరంగ సభకు మాజీ ఎంపి బృందాకరత్‌, ఎఐకెఎస్‌ అఖిల భారత అధ్యక్షులు అశోక్‌ ‌దావలే, ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్‌, పలువురు రైతు సంఘాల నేతలు హాజరవుతారని తెలిపారు. బహిరంగ సభ సందర్భంగా నల్లగొండలో మహాప్రదర్శన నిర్వహిస్తున్నామని, అందులో రెడ్‌‌షర్టు వలంటీర్ల కవాతు, సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. 15వ తేదీ సాయంత్రం నుంచి 18 వరకు ప్రతినిధుల సభ జరుగుతుందని తెలిపారు.14న ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధించి 200 స్టాళ్లతో ఎగ్జిబిషన్‌‌ను నిర్వహించనున్నట్టు తెలిపారు. మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని తెలిపారు. రైతు అన్ని రకాలుగా నష్టపోతుంటే వారికి సబ్సిడీలు,  రాయితీలు ఇవ్వాల్సింది పోయి కార్పోరేట్లకు ఊడిగం చేస్తున్నారని దీనితో ఉత్పత్తి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతు రక్షణ దేశ రక్షణ అని అందుకోసం రైతు సంఘం పోరాడుతుందని తెలిపారు.ఈ పోస్టరావిష్కరణలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బానోతు వెంకన్న, రైతు సంఘం నాయకులు  కొండబత్తుల వెంకన్న, చేపూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; జి శ్రీనివాస్, మహబూబాద్, మహబూబాబాద్ జిల్లా