చలో ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన శ్రీహరిరావు
సూర్య నిర్మల్ ప్రతినిధి : ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం తరలివెళ్లారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు జెండా ఊపి బస్సును ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ.. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వేలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నట్లు తెలిపారు. ఓటు చోరీ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలదీస్తామని పేర్కొన్నారు.