BREAKING
గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు వేదిక బాలల దినోత్సవం నిత్యావసర వస్తువుల ధరలు, నిల్వలు, సరఫరాపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు వాకథాన్, ఉచిత మధుమేహ పాద పరీక్ష శిబిరం జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గ్రంథాలయంలో బాలల దినోత్సవ వేడుకలు! నూతన పింఛన్ల పత్రాల పంపిణీ చేసిన సర్పంచులు పేద విద్యార్థులకు పలకలు ,పుస్తకాలు పంపిణీ పేద విద్యార్థులకు పలకలు ,పుస్తకాలు పంపిణీ ప్రముఖ సీనియర్ నటుడు, దర్శక నిర్మాత గిరిబాబు మరణం విచారకరం హైవేపై మృత్యుపాశంలా మారిన మరమ్మతు వాహనం 20 రోజులుగా పట్టించుకోని అధికారులు ఘనంగా నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా వేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకలకు సర్వం సిద్ధం పంటల పరిశీలన.. రైతులకు శాస్త్రవేత్తల సూచనలు! కొమరోలులో కృషోన్నతి యోజన కార్యక్రమం పరిశ్రమలు, ప్రకృతి సందర్శనలతో విద్యార్థులకు విజ్ఞాన యాత్ర

భక్తిపారవశ్యంలో అడుగుల భజన

Select Suryaa Now
భక్తిపారవశ్యంలో అడుగుల భజన

  *--ఉర్కొండపేటలో ఇప్పటూరు భజన బృందం ప్రదర్శనకు ప్రశంసలు.* 

నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని ఇప్పటూరు గ్రామానికి చెందిన శ్రీ శివాంజనేయ భజన మండలి సభ్యులు ఉర్కొండపేట గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద  అడుగుల భజన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.గ్రామ సర్పంచ్ రవి కిరణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం భజన బృందం సభ్యులు ఉర్కొండపేటకు చేరుకుని సంప్రదాయబద్ధంగా అడుగుల భజన ప్రదర్శించారు.తమదైన శైలిలో అడుగులు వేస్తూ,భక్తి గీతాలతో భక్తులను ఆకట్టుకున్నారు.భజన బృందం సభ్యుల ప్రతిభ,లయబద్ధమైన అడుగులు,భక్తిభావంతో కూడిన ప్రదర్శనను చూసిన స్థానికులు ఎంతగానో మెచ్చుకున్నారు.ఈ కార్యక్రమంలో ఇప్పటూరు గ్రామ ఉప సర్పంచ్ నర్సింహులు యాదవ్,వార్డు సభ్యులు అరవింద్,అరుణబాయి,సుధాకర్,శివలీలాశేఖర్,మంచాల యాదయ్య, శివాలయ చైర్మన్ మహేష్,నర్సింగారావు,గోపాల్,గణేష్,శ్రీహరి,రవి,సతీష్ తదితరులు పాల్గొన్నారు.అలాగే భజన మండలి సభ్యులు కరణ్ జీ,బలరాం,యాదయ్య తదితరులు పాల్గొని తమ అద్భుతమైన ప్రదర్శనతో కార్యక్రమాన్ని భక్తిమయంగా మార్చారు.ఇప్పటూరు భజన బృందం ప్రదర్శనకు ఉర్కొండపేట గ్రామస్తుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి.