భక్తి పరవశంలో లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక శోభతో అలరించే జాతర
సూర్య భీమ గల్ : తెలంగాణ ప్రాంతంలో ఆధ్యాత్మికతకు, భక్తి సంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలోని లింబాద్రి గుట్ట ఒకటి. ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన ఈ పుణ్యక్షేత్రం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది.
* నేటి నుండి ప్రారంభమైన ఉత్సవాలు: అంగరంగ వైభవంగా పది రోజులపాటు కొనసాగుతాయి .ప్రతి సంవత్సరం జరిగే లింబాద్రి గుట్ట జాతర భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వేడుక. జాతర సమయంలో పరిసర గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తుల రాకతో గుట్ట పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి.