కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ :ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణమే లక్ష్యంగా నగరంలోని 46వ డివిజన్, కోవూరు నగర్‌లో నేడు విస్తృత స్థాయి స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. రోజువారీ సేవా కార్యక్రమంలో భాగంగా డివిజన్ వ్యాప్తంగా పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్‌లోని ప్రధాన కాలువలను ఎప్పటికప్పుడు పూడికతీసి శుభ్రం చేయడంతో పాటు, రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పూర్తిగా తొలగించారు. అలాగే ప్రజలకు ఇబ్బందికరంగా మారిన పిచ్చి మొక్కలను సైతం తొలగించి ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా 46వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా వలి షేక్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య రక్షణకు, పరిశుభ్రమైన వీధుల ఏర్పాటుకు అందరం కలిసికట్టుగా శ్రమించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రతే ఆరోగ్యానికి మొదటి మెట్టని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. మనమందరం కలిసికట్టుగా శ్రమిస్తే కోవూరు నగర్‌ను ఆదర్శవంతమైన 'స్వచ్ఛ నగర్'గా తీర్చిదిద్దుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్