గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహణ
మెలియాపుట్టి. నవంబర్ 15. మేజర్ న్యూస్.
పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించేందుకు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మెలియాపుట్టి శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. గ్రంథాలయ అధికారి ఆర్. అనురాధ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పుస్తకాలను ప్రదర్శించారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం, జ్ఞాపకశక్తి పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్వేత, టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మీపతి, ఉపాధ్యాయులు హరి, నీలిమ, జయంతి, పాఠకులు మణి, పవన్, శ్యామ్, విద్యార్థులు, గ్రంథాలయ సహాయకురాలు హేమలత పాల్గొన్నారు.