BREAKING
పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహణ చినపాచిల సర్పంచ్ అభ్యర్థిగా శంకర్రావు నామినేషన్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం.... పంచాయతీ నామినేషన్లకు పటిష్ట భద్రత. - ఎస్పీ తుహిన్ సిన్హా. భక్తి పరవశంలో లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక శోభతో అలరించే జాతర కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం రాష్ట్ర స్థాయి SGF ఫెన్సింగ్ పోటీలకు పైల దుష్యంత్ ఎంపిక మంత్రి తుమ్మలకు జన్మదిన శుభాకాంక్షలు-కాసాని పద్మ శేఖర్ కేంద్రాల్లోకి రావొద్దంటూ వాగ్వాదం.. ఎంపీడీవో చెప్పినా వినిపించుకోని ఎస్సై భక్తి పరవశంలో లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక శోభతో అలరించే జాతర శ్రీవారి సేవలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సోమవారం పీజీఆర్ఎస్ రద్దు : గుంటూరు జిల్లా కలెక్టర్

రాష్ట్ర స్థాయి SGF ఫెన్సింగ్ పోటీలకు పైల దుష్యంత్ ఎంపిక

Select Suryaa Now
రాష్ట్ర స్థాయి SGF ఫెన్సింగ్ పోటీలకు పైల దుష్యంత్ ఎంపిక

అనకాపల్లి ప్రతినిధి, మేజర్ న్యూస్ అండర్-14 ఎపీ విభాగంలో విశాఖపట్నం జిల్లా తరఫున ప్రాతినిధ్యం...
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు పరవాడకు చెందిన యువ క్రీడాకారుడు పైల దుష్యంత్ ఎంపికయ్యాడు.నవంబర్ 14న అనకాపల్లిలోని మామిడిపాలెం పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ జెడ్‌పీ హైస్కూల్‌లో నిర్వహించిన విశాఖపట్నం జిల్లా స్థాయి ఫెన్సింగ్ ఎంపిక పోటీలలో దుష్యంత్ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు.ఈ నెల 21, 22 తేదీలలో కృష్ణా జిల్లా గన్నవరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-14 బాలుర ఎపీ  విభాగంలో విశాఖపట్నం జిల్లా తరఫున దుష్యంత్ ప్రాతినిధ్యం వహించనున్నాడు.
దుష్యంత్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఐకాన్ స్పోర్ట్స్ హబ్  యాజమాన్యం, కోచ్‌లు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఫెన్సింగ్ కోచ్ మొల్లి తులసీరావు మాట్లాడుతూ, దుష్యంత్ శిక్షణలో ఎంతో క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదల కనబరుస్తున్నాడని తెలిపారు. నిరంతర సాధన, కృషితో జిల్లా స్థాయి ఎంపిక పోటీలలో సత్తా చాటి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంఅభినందనీయమన్నారు. గన్నవరంలో జరగనున్న పోటీలలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకం సాధించడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు.దుష్యంత్ సాధించిన ఈ విజయం పరవాడ ప్రాంతంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఐకాన్ స్పోర్ట్స్ హబ్ యాజమాన్యం పేర్కొంది. రాష్ట్ర స్థాయి పోటీలలో దుష్యంత్ విజయం సాధించి జిల్లాకు, తన స్వగ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది.

రవి కుమార్,NDP సూర్య ప్రతినిధి , అనకాపల్లి.