BREAKING
సెయింట్ విన్సెంట్ పల్లోటిస్కూలులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహణ చినపాచిల సర్పంచ్ అభ్యర్థిగా శంకర్రావు నామినేషన్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం.... పంచాయతీ నామినేషన్లకు పటిష్ట భద్రత. - ఎస్పీ తుహిన్ సిన్హా. భక్తి పరవశంలో లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక శోభతో అలరించే జాతర కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం రాష్ట్ర స్థాయి SGF ఫెన్సింగ్ పోటీలకు పైల దుష్యంత్ ఎంపిక మంత్రి తుమ్మలకు జన్మదిన శుభాకాంక్షలు-కాసాని పద్మ శేఖర్ కేంద్రాల్లోకి రావొద్దంటూ వాగ్వాదం.. ఎంపీడీవో చెప్పినా వినిపించుకోని ఎస్సై భక్తి పరవశంలో లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక శోభతో అలరించే జాతర శ్రీవారి సేవలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

Select Suryaa Now
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

 

పిఎం పాలెం మేజర్ న్యూస్ : భీమిలి నియోజకవర్గంలో 20 మంది లబ్ధిదారులకు  రూ. 11.47 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ఎంవీపీ కాలనీ క్యాంప్ ఆఫీస్ లో అందజేశారు. 8, 11, 120 వార్డుల్లో ముగ్గురేసి.. 3, 4, 10 వార్డుల్లో ఇద్దరు చొప్పున లబ్ధిదారులకు అందించారు. అలాగే 1, 5, 6, 7, వార్డుల్లో ఒక్కొక్కరికి రిలీఫ్ ఫండ్ చెక్కులిచ్చారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కష్టాల్లో ఉన్న వారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేగంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో  కార్పొరేటర్లు గరే సదానంద, గాడు చిన్ని కుమారి లక్ష్మి, గరే జ్యోతి, పీవీ నరసింహం, శాఖారి శ్రీనివాస్, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, దండి వెంకటేష్, గరే గుర్నాథ్, తమ్మిన సూరిబాబు, కొప్పల రమేష్, గంటా నూకరాజు, గొలగాని నరేంద్ర, గరికిన ఎల్లాజీ, పోలిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ శ్రీనివాస్ 

మధురవాడ