సెయింట్ విన్సెంట్ పల్లోటిస్కూలులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.
సెయింట్ విన్సెంట్ పల్లోటిస్కూలులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. పెడన,భారతదేశ ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 137వ జయంతిని పురస్కరించుకుని తమ పాఠశాల లో ఘనంగా బాలల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని కరస్పాండెంట్ ఫాథర్ బాలశౌరీ ,ప్రిన్సిపల్ ఫాథర్ జాల యాకోబు తెలిపారు., ఈ మేరకు కొందరు పేరెంట్స్ తో కలసి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల ద్వారా తమ పాఠశాల ఉపాద్యాయినీ-ఉపాద్యాయుల చే నేర్చుకున్న నృత్య ప్రదర్శన స్కిట్స్ పాటలు విద్యార్థినీ-విద్యార్థులు ప్రదర్శించారు. తదుపరి పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సర విద్యార్థినీ-విద్యార్థులు సాధారణమైన కార్యక్రమాల నుండి తమలో దాగిన ప్రతిభ ద్వారా అసాధారణ కార్యక్రమాలు చేసియున్నారని అభినందనలు తెలిపామన్నారు.ఈ విద్యాసంవత్సరంలో నిర్వహించిన పలువిధములైన పోటీలలో విజేతలుగా నిలచినవారికి మరియు యన్. సి. సి. విద్యార్థినీ-విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రధానం చేసినారు.చివరిగా కార్యక్రమంను ఎంతో ఘనంగా నిర్వహించుటలో సహకరించిన ప్రతి ఉపాద్యాయినీ-ఉపాద్యాయులకు ఫాథర్ యాకోబు ధన్యవాదములు తెలియజేశారు.