భక్తిశ్రద్ధలతో కార్తీక మాస రుద్ర పూజ
మేజర్ న్యూస్, మాకవరపాలెం :
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో, జెడ్పీటీసీ ఆల్లు రామ నాయుడు నేతృత్వంలో ఆదివారం కార్తీక మాస రుద్ర పూజ అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. శెట్టిపాలెం గ్రామంలోని కామదేనువమ్మ ఆలయ ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభమైంది.
వేద మంత్రోచ్ఛారణల మధ్య సామూహికంగా నిర్వహించిన ఈ రుద్ర పూజలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. లోకకల్యాణం, గ్రామ సుభిక్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఆల్లు రామ నాయుడు మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సమాజంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తాయని పేర్కొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
రిపోర్టర్
A అప్పలనాయుడు