BREAKING
పుస్తక పఠనంతో జ్ఞాపకశక్తి లక్ష్మీనరసింహ స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని* షఫీ కుటుంబానికి బుట్టా శివ నీలకంఠ పరామర్శ.. ఆర్థిక సాయం అందజేత భక్తిశ్రద్ధలతో కార్తీక మాస రుద్ర పూజ కడిమెట్లలో మరో 50 ఏళ్ల అయినా టిడిపి జెండా ఎగరదు.. వైసీపీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి సెయింట్ విన్సెంట్ పల్లోటిస్కూలులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహణ చినపాచిల సర్పంచ్ అభ్యర్థిగా శంకర్రావు నామినేషన్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం.... పంచాయతీ నామినేషన్లకు పటిష్ట భద్రత. - ఎస్పీ తుహిన్ సిన్హా. భక్తి పరవశంలో లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక శోభతో అలరించే జాతర కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం

షఫీ కుటుంబానికి బుట్టా శివ నీలకంఠ పరామర్శ.. ఆర్థిక సాయం అందజేత

Select Suryaa Now
షఫీ కుటుంబానికి బుట్టా శివ నీలకంఠ పరామర్శ.. ఆర్థిక సాయం అందజేత

ఎ మ్మిగనూరు, సూర్య ప్రతినిధి.పట్టణంలోని 44వ వార్డులో నివాస గృహం కూల్చివేతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న షఫీ కుటుంబాన్ని బుట్టా ఫౌండేషన్ అధినేత, మాజీ ఎంపీ బుట్టా రేణుక భర్త బుట్టా శివ నీలకంఠ పరామర్శించారు.ఈ సందర్భంగా కూల్చివేసిన నివాసాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని, ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ పరిస్థితిపై స్పందించిన ఆయన ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. కుటుంబ సభ్యులు అధైర్యపడవద్దని, కష్టకాలంలో అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహమ్మద్, పట్టణ అధ్యక్షుడు కామర్తి నాగేశప్ప, 44వ వార్డు అభ్యర్థి ఇబ్రహీం, కరే రాము,  గుడికల్ అల్తాఫ్, బనవాసి బసిరెడ్డి, తిమ్మాపురం బోయ బజారి, కడివెల్ల ఊరుకుందు గౌడ్, సయ్యద్ ఫయాజ్, తిమ్మాపురం వీరాంజనేయులు, నాగలాపురం నరసింహులు, కొటెకల్ పాపన్న, రాజారెడ్డి, నాయక్ ఎండి షరీఫ్,  సోమశేఖర్,  కదిరికోట రాజ్ కుమార్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
*A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*