పుస్తక పఠనంతో జ్ఞాపకశక్తి
మెలియాపుట్టి. నవంబర్ 15. మేజర్ న్యూస్..
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మెలియాపుట్టి శాఖా గ్రంథాలయంలో ఆదివారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. గ్రంథాలయ అధికారి ఆర్. అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు పుస్తకాలను ప్రదర్శించారు. పుస్తక పఠనంతో విజ్ఞానం, జ్ఞాపకశక్తి పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్వేత, టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మీపతి, ఉపాధ్యాయులు, పాఠకులు, విద్యార్థులు, గ్రంథాలయ సహాయకురాలు హేమలత పాల్గొన్నారు.
అనపాన నాగిరెడ్డి..... మెలియాపుట్టి.