వైఎస్సార్సీపీ ఎంపీటీసీకి రెడ్డి శాంతి సన్మానం
మెలియాపుట్టి. నవంబర్ 15. మేజర్ న్యూస్..
ఎల్.ఎన్.పేట మండలం బోర్రంపేట ఎంపీటీసీగా వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించిన మామిడి రాజ్యలక్ష్మిని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి ఆదివారం అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనపాన నాగిరెడ్డి.. మెలియాపుట్టి.