కడిమెట్లలో మరో 50 ఏళ్ల అయినా టిడిపి జెండా ఎగరదు.. వైసీపీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి
*ఎమ్మిగనూరు, సూర్యప్రతినిధి.* కడిమెట్ల గ్రామపంచాయతీ లోని ఐదు గ్రామాలలో మరో 50 ఏళ్ళు అయినా కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరదని స్థానిక ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వరరెడ్డి తెలుసుకుంటే మంచిదని ఎమ్మిగనూరు వైకాపా ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్, జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో నైతికంగా వైసీపీ అభ్యర్థులే గెలుపొందారని కూటమి నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ 26వ వార్డులో గోనెగండ్ల ఐటీడీపీకి చెందిన ఒక యువకుడు పోలింగ్ బూత్ లో దొంగ ఓట్లు వేయలేదా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.. ఇలా ప్రతి బూతులో ఆప్నా శేఖర్ రిగ్గింగులు చేయించడం వలన మున్సిపాలిటీ కైవసం చేసుకున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకోకుండా న్యాయబద్ధంగా ఎలక్షన్లు జరిగి ఉంటే పట్టణ ప్రజలు వైసిపికే పట్టం కట్టే వారన్నారు. ఇక ఎంపిటిసి జడ్పిటిసి స్థానాల్లో ఎమ్మిగనూరు గోనెగండ్ల మండలాల్లో వైసిపి ప్రభంజనం చూపిస్తే జీర్ణించుకోలేక కౌంటింగ్ కేంద్రాల్లో వైసీపీ ఏజెంట్లను పోలీసులతో బెదిరించిన సంఘటన గుర్తుందన్నారు. ఇకపోతే వైసిపికి ఓటు వేశారని షఫీ ఇంటిని కూల్చివేయడం చూస్తుంటే టిడిపి నాయకులు ఎంత దాస్టికంగా వ్యవహరిస్తున్నారు అర్థం అవుతుందన్నారు. 40 ఏళ్లుగా ఎన్నికలు జరగలేదని కడిమెట్ల పంచాయతీ పై మాట్లాడుతున్న బీవీ ఎన్నికల జరిపితే డిపాజిట్లు కూడా రాలేదని తెలుసుకుంటే మంచిదంటూ హి తవు పలికారు. ఈ కార్యక్రమంలో డిఆర్ బసిరెడ్డి 44 వ వార్డు వైసిపి ఇన్చార్జి ఇబ్రహీం, షఫీ తదితరులు పాల్గొన్నారు. *A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*