పంచాయతీ నామినేషన్లకు పటిష్ట భద్రత. - ఎస్పీ తుహిన్ సిన్హా.
అనకాపల్లి, నవంబర్ 15, మేజర్ న్యూస్: జిల్లాలో నేటి నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులకు, ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి నిబంధనను కఠినంగా అమలు చేయాలి. అనుమతి లేని వ్యక్తులను ఆ పరిధిలోకి అనుమతించరాదు. నామినేషన్ కేంద్రాల సమీపంలో గుంపులుగా గుమికూడటం, ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతి లేదు. ట్రాఫిక్‌కు, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి. నామినేషన్లు జరుగుతున్న మొత్తం 8 మండలాల్లో పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
రిపోర్టర్: నాగు
అనకాపల్లి.