కేంద్రాల్లోకి రావొద్దంటూ వాగ్వాదం.. ఎంపీడీవో చెప్పినా వినిపించుకోని ఎస్సై
బత్తలపల్లి:
ఎన్నికల విధుల్లో భాగంగా బత్తలపల్లికి వచ్చిన రొద్దo ఎస్సై రాజకుల్లాయప్ప, ఎన్నికల కవరేజీ కోసం వెళ్లిన ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, సాక్షి, మరి కొంతమంది, పాత్రికేయులతో దురుసుగా వ్యవహరించి ఎన్నికల కేంద్రాల్లోకి పాత్రికేయులు రావడానికి వీల్లేదంటూ ఎస్సై వారితో వాగ్వాదానికి దిగాడు.
అదే సమయంలో అక్కడే ఉన్న ఎంపీడీవో పాత్రికేయుల విధులు, ఎన్నికల కవరేజీకి సంబంధించిన విషయాలను ఎస్సైకి వివరించే ప్రయత్నం చేసినప్పటికీ, 'మీ రూల్స్ మీవి.. మా రూల్స్ మావి' అంటూ ఎస్సై వలగరగా సమాధానం ఇచ్చినట్లు పాత్రికేయులు పేర్కొన్నారు. అనంతరం వారిని రోడ్డుపైకి పంపించడంతో పోలీసులకు, పాత్రికేయులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
ఎన్నికల పారదర్శకతకు పాత్రికేయుల కవరేజీ కీలకం కాదా?
ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉంటుంది. అయితే ఎన్నికల కేంద్రాల్లో భద్రతా నిబంధనలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాల్సిందే. అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులకు నిబంధనలను గౌరవప్రదంగా వివరించి, వారి కవరేజీకి అనుమతించదగిన పరిధిలో సహకరించాల్సిన బాధ్యత అధికారులపై కూడా ఉంది.
ఏదైనా గోల్‌మాల్ చేయడానికే నేమో?
ఎన్నికల కేంద్రాల్లో పాత్రికేయులను అనుమతించకపోవడంపై స్థానికంగా పలువురు నాయకులు, ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఏవైనా అక్రమాలు లేదా గోల్‌మాల్ జరిగే అవకాశం ఉందనే అనుమానంతోనే పాత్రికేయులను దూరంగా ఉంచారా? అన్న ప్రశ్నలను కొందరు నాయకులు లేవనెత్తుతున్నట్లు సమాచారం.
ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే పారదర్శకత అత్యంత అవసరం. అధికారులు, పోలీసులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. పాత్రికేయుల పట్ల అనవసర ఆంక్షలు, దురుసు ప్రవర్తనకు తావులేకుండా ఎన్నికల విధుల్లో సంయమనం పాటించాలని పాత్రికేయ వర్గాలు కోరుతున్నాయి.