శ్రీవారి సేవలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ
తిరుమల మేజర్ న్యూస్,
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
తిరుమల రిపోర్టర్
టి. వెంకట్ రాజ్