ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సిరి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం మండల ఫరిదిలోని కప్పట్రాళ్ల గ్రామంలోని హైస్కూల్ దగ్గర ఎన్నికల నామినేషన్ ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ కేవలం ఒక్క హెల్ప్ డెస్క్ ఉండటంతో నిబంధనలు తెలియవా అంటూ ఎంపిడిఓ జ్యోతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అరగంటలో ఇంకా మూడు హెల్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పంచాయతీ కార్యదర్శి ని సస్పెండ్ చేయాలని ఆర్డీవో ఓబులేష్ ను ఆదేశించారు. అనంతరం కరివేముల,దేవనకొండలోని నామినేషన్ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.