BREAKING
పద్మనాభం మండలంలో ఘనంగా కాళ్ల నగేష్ కుమార్ జన్మదిన వేడుకలు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహణ చినపాచిల సర్పంచ్ అభ్యర్థిగా శంకర్రావు నామినేషన్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం.... పంచాయతీ నామినేషన్లకు పటిష్ట భద్రత. - ఎస్పీ తుహిన్ సిన్హా. భక్తి పరవశంలో లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక శోభతో అలరించే జాతర కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం కోవూరు నగర్‌లో ఘనంగా స్వచ్ఛతా కార్యక్రమం రాష్ట్ర స్థాయి SGF ఫెన్సింగ్ పోటీలకు పైల దుష్యంత్ ఎంపిక మంత్రి తుమ్మలకు జన్మదిన శుభాకాంక్షలు-కాసాని పద్మ శేఖర్ కేంద్రాల్లోకి రావొద్దంటూ వాగ్వాదం.. ఎంపీడీవో చెప్పినా వినిపించుకోని ఎస్సై భక్తి పరవశంలో లింబాద్రి గుట్ట.. ఆధ్యాత్మిక శోభతో అలరించే జాతర శ్రీవారి సేవలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సోమవారం పీజీఆర్ఎస్ రద్దు : గుంటూరు జిల్లా కలెక్టర్

RS ప్రవీణ్ కుమార్ ఒక‌ రాజకీయ వ్యభిచారి.

Select Suryaa Now
RS ప్రవీణ్ కుమార్ ఒక‌ రాజకీయ వ్యభిచారి.

 సూర్య కరీంనగర్ :తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన ఎస్సీ సెల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చంటి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగ అపర్ణ స్పష్టం చేశారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  రాజకీయంగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇతర నాయకులపై విమర్శలు చేయడం కాదు, ప్రజలకు మీరు చేసిన సేవలు ఏమిటో చెప్పాలి. ముఖ్యంగా దళిత సమాజానికి మీరు అంధించిన ప్రయోజనాలు ఏమిటి దళితుల అభ్యున్నతి కోసం మీరు చేసిన పోరాటాలు ఏమిటి దళిత యువతకు, నిరుద్యోగులకు, పేద కుటుంబాలకు మీ రాజకీయ ప్రస్థానం ద్వారా కలిగిన ప్రయోజనం ఏమిటో ప్రజలకు వివరించాలి.

దళితుల పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం సులభమే. కానీ దళితుల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడం ముఖ్యం. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారనే విమర్శలకు మీరు సమాధానం చెప్పాలి.

మా నాయకురాలు కల్వకుంట్ల కవితమ్మ గారిని విమర్శించే ముందు మీ రాజకీయ వైఖరిని, మీ గతంలో మీరు బి.ఆర్.ఎస్ పార్టీ మిద అదేవిధంగా కేసీఆర్ మీద కేటిఆర్ మీద చేసిన వ్యాఖ్యలను ప్రజలందరూ చూసినారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పక్కన చేరి మీరు కవితమ్మ మీద విమర్శలు చేస్తున్నారు అంటే మీకు వారికి మధ్యలో కుదిరిన ప్యాకేజ్ ఎంతో ప్రజలు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో BSP పార్టీ అధ్యక్షుడిగా మీరు ఇప్పుడు ఉన్న పార్టీ మీద చేసిన మాటలకు  సమాధానం చెప్పు. మీరు ప్రజా జీవితంలో చేసిన పనులను ప్రజల ముందు ఉంచండి. మీరు ప్యాకేజ్ తీసుకుని చేసే రాజకీయ విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అదే సమయంలో మా నాయకురాలిపై నిరాధారమైన ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తే ప్రతి వేదికపైనా ప్రజాస్వామ్యబద్ధంగా నీకు గట్టిగానే బుద్ది చెబుతాము.

మిస్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  తెలంగాణ రక్షణ సేన అంటే పదవుల కోసం పుట్టిన పార్టీ కాదు. ప్రజల హక్కుల కోసం ప్రశ్నించే శక్తి. మా నాయకురాలు కవితమ్మ గారి నాయకత్వంపై మీరు చేసే వ్యాఖ్యలకు మేము రాజకీయంగానే, ప్రజాక్షేత్రంలోనే సమాధానం చెబుతాం.

మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, మా నాయకురాలు కల్వకుంట్ల కవితమ్మ గారికి పత్రికాముఖంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో నీకు నీవు ఉన్న పార్టీకి రాజకీయ భవిష్యత్త్ లేకుండా చేస్తాం. 
నువ్వు నీ స్వార్ధం కోసం ఎందరో ప్రజా ఉద్యమకారులైన, దళిత బిడ్డలను ఎన్ కౌంటర్ పేరు మీద చంపిన నీ నీచమైన చరిత్రను ఎవరు మరిచిపోరు. రానున్న రోజులలో నవ్వు చేసిన అరాచకాలను కూడ బయట పెడుతామని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా
ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు చంటి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగ అపర్ణ లు అన్నారు.