కార్తీక మాసంలో సలుగుపల్లిలో ఆధ్యాత్మిక శోభ
సూర్య బెజ్జుర్ : కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంపరిధిలోని సలుగుపల్లి లో కార్తీక మాసం ప్రారంభంతో గ్రామంలో భక్తి సందడి నెలకొంది. ప్రతిరోజూ తెల్లవారుజామున 5 గంటలకే గ్రామంలోని శివ కేశవ ఆంజనేయ ఆలయం నుంచి భక్తులు ప్రధాన వీధుల్లో హరే రామ నామస్మరణతో ప్రదక్షిణలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక పురాణంలోని ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని పఠిస్తూ భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు.